Hemant Soren: జార్ఖండ్ 14వ సీఎంగా ప్రమాణస్వీకారం..! 24 d ago
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసారు. హేమంత్ సోరెన్‌తో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ఖర్గే, శరద్ పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఉదయనిధి స్టాలిన్, తేజస్వి యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నేతలు హాజరయ్యారు. రాంచీలోని మోరబడి గ్రౌండ్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.